*మల్లంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు ప్రేమ్ కుమార్ కోలుకొండ గ్రామ పరిధిలో మృతి*
*- మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దేవరుపల ఎస్ఐ*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి) : దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామ పరిధిలోని గుట్ట పైన ఒక వ్యక్తి మృతదేహం ఉన్నదన్న సమాచారం మేరకు దేవరుప్పుల ఎస్ఐ సృజన్ కుమార్ శుక్రవారం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. దేవరుప్పుల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు దేవా కుమారుడు గుగులోతు ప్రేమ్ కుమార్ (26) గా గుర్తించారు.
మృతుడు గత నాలుగు నెలల నుండి మానసిక స్థితి సరిగా లేక బాధపడుతు న్నాడని, గత మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన బైక్ తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోగా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు తెలిపారు. మృతుడు ప్రేమ్ కుమార్ కోలుకొండ గుట్ట ఎక్కి అధిక మోతాదులో టాబ్లెట్లు మింగి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తుంచినట్లు తెలిపారు. మృతుడి తండ్రి గుగులోతు దేవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సృజన్ కుమార్ వివరించారు.

