📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎడతెరిపి వర్షాలు.. మున్సిపల్ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎడతెరిపి వర్షాలు.. మున్సిపల్ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

ఎడతెరిపి వర్షాలు.. మున్సిపల్ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక నిఘా అవసరం

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

299 డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్

గుండ్లపోచంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ కోరారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, డ్రైనేజీలు, కల్వర్టుల వద్ద నీరు నిలిచిపోయే అవకాశం ఉందని భానుచందర్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పరిస్థితిని పరిశీలించాలని, నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా డ్రైనేజీలు పొంగిపొర్లడం, నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే స్పందించి నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరే పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే డ్రైనేజీ మార్గాలను శుభ్రం చేయడం, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారం తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.

విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

భారీ వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న విద్యుత్ పరికరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భానుచందర్ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినట్లు గుర్తిస్తే ప్రజలు వాటికి దూరంగా ఉండి వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా వర్షాల కారణంగా నేలకొరిగే అవకాశం ఉన్న చెట్లు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, ప్రమాదకర ప్రాంతాలను అధికారులు గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బంది కూడా తమ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రక్షణ పరికరాలతో విధులు నిర్వహించాలని సూచించారు.

 

అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయాలి

వర్షాల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలకు తక్షణ సహాయం అందేలా మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, డ్రైనేజీ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని భానుచందర్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమలు పెరగకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

 

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా వర్షాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కుండ భానుచందర్ సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో అనవసరంగా ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, ప్రమాదకర చెట్లు, శిథిల నిర్మాణాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.  ప్రస్తుత వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల రక్షణ, పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ సుదంష్‌తో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులను 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.