📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘాట్ కేసర్ లోనీవినాయక విగ్రహ ప్రతిష్ఠా పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఘాట్ కేసర్ లోనీవినాయక విగ్రహ ప్రతిష్ఠా పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి):   వినాయక చవితి సందర్భంగా ఘట్కేసర్‌లోని ఎంఎంసీ 6వ డివిజన్ పరిధిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఘట్కేసర్ పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆర్కే శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠా పూజలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎస్‌ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఈడబ్ల్యూఎస్ కాలనీ యూనివర్సల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలాజీనగర్‌లో టీమ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాల్లోనూ మల్లారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.