📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మెగా ఇండస్ట్రియల్ హబ్ లోని పారిశ్రామిక బ్లాకులను పరిశీలన.

మెగా ఇండస్ట్రియల్ హబ్ లోని పారిశ్రామిక బ్లాకులను పరిశీలన.

📰 Generate e-Paper Clip

దొనకొండ జూన్ 10( ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో ): స్థానిక మండల కేంద్రంలోని బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు విమానాశ్రయాన్ని సందర్శించి తహసిల్దార్ రమాదేవిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను రెండు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి,అద్దంకి ఆర్డిఓ విజయ జ్యోతి కుమారి లతో కలిసి మెగా పారిశ్రామిక హబ్ వివిధ బ్లాకులను సందర్శించారు.ఈ హబ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, అవసరతలు స్థానిక పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయా అంశాలపై తహసిల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సబిక్షించారు. ఈ ప్రాంతాన్ని 25 వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఇప్పటికే బీడీఎల్,ఏపీ జి ఈ సి,భవ్య ఇండస్ట్రీ సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయని అన్నారు. బీడీఎల్ సంస్థ కోరిన భూమిని సమీపంలోనే హెయిర్ స్క్రి ప్ ఉండడంతో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు తాను వచ్చినట్లు తెలిపారు.ఈ 25 వేల ఎకరాలతో కూడిన హబ్ లో భూ సేకరణ త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రభుత్వ,పట్టా, అసైన్డ్, పోరంబోకు తదితర రకాల భూముల సర్వేను కూడా రెండు వారాలలో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని తెలిపారు.మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కలెక్టర్ తెలిపారు.ఈ ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసిన వారికి బిల్లులను పూర్తిస్థాయిలో చెల్లించామన్నారు.త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లను రప్పించి పారిశ్రామిక అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బి రమాదేవి మండల అభివృద్ధి అధికారి వి వసంతరావు నాయక్,సర్కిల్ ఇన్స్పెక్టర్, వైu రామారావు,సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ, అన్ని శాఖల అధికారులు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular