అశ్విన్ రావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం
•••చిక్కాల రామారావు కుటుంబాన్ని పరమర్శించిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే . టీ . రామ రావు , చిక్కాల రామారావు కుటుంబాన్ని పరామర్శించారు చిక్కాల రామారావు తనయుడు అశ్విన్ రావు ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అశ్విన్ రావు మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న కేటీఆర్, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అశ్విన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.





