📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipet"ప్రధాని మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం "మనబడి–మన బాధ్యతలో భాగంగా పరిశుభ్రత...

“ప్రధాని మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం “మనబడి–మన బాధ్యతలో భాగంగా పరిశుభ్రత పనులు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 13 (ప్రజావాణి)

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు “మనబడి–మన బాధ్యత” ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పాఠశాలలో శుభ్రపరిచి, పాఠశాల పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించి, మొక్కల చుట్టూ శుభ్రత పనులు నిర్వహించారు.పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, పాఠశాలలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మ రాజు,భూత్ అధ్యక్షుడు చెప్యాల సాయిరాం, పోలవేణి వెంకటేష్, కొత్తూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular