📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) శాయంపేటలో  సక్సెస్ మీట్ కమ్ అడ్మిషన్ మేళా కార్యక్రమం

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) శాయంపేటలో  సక్సెస్ మీట్ కమ్ అడ్మిషన్ మేళా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), శాయంపేటలో  “సక్సెస్ మీట్ కమ్ అడ్మిషన్ మేళా” కార్యక్రమం

ప్రజావాణి శాయంపేట

మండలంలోని గోవిందపూర్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీ బివీ సక్సెస్ మీట్ అడ్మిషన్ మేళా
ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  జిల్లా లింగ సమానత్వ సమన్వయకర్తగా  సునీత  విశిష్ట అతిథులుగా శాయంపేట మండల ఎంఈఓ బిక్షపతి  గోవిందాపూర్   స్థానికులు శ్రవణ్  ఉప సర్పంచ్ నరేందర్ వివిధ మండలాల నుంచి విచ్చేసిన కేజీబీవీ ఎస్ఓ లు సిఆర్ టి లు పిసిఆర్టి లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజీబీవీలలో విద్యార్థినులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, సురక్షిత వసతి, పోషకాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఉన్నత విద్య అవకాశాల గురించి తల్లిదండ్రులు, విద్యార్థినులకు  వివరించారు.
కార్యక్రమంలో కేజీబీవీలలో చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న విద్యార్థినుల విజయగాథలను పంచుకోవడంతో పాటు, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ టాపర్స్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను పరిచయం చేశారు. వారి విజయాలు ఇతర విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
ఈ అడ్మిషన్ మేళా ద్వారా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన బాలికలు, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా కొత్తగా 60 అడ్మిషన్లు నమోదు కావడం విశేషం.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ కేజీబీవీల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం బాలికల విద్యాభివృద్ధికి, కేజీబీవీలపై అవగాహన పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడిందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular