మెగా ఇండస్ట్రియల్ హబ్ లోని పారిశ్రామిక బ్లాకులను పరిశీలన.

దొనకొండ జూన్ 10( ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో ): స్థానిక మండల కేంద్రంలోని బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు విమానాశ్రయాన్ని సందర్శించి తహసిల్దార్ రమాదేవిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను రెండు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి,అద్దంకి ఆర్డిఓ విజయ జ్యోతి కుమారి లతో కలిసి మెగా పారిశ్రామిక హబ్ వివిధ బ్లాకులను సందర్శించారు.ఈ హబ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, అవసరతలు స్థానిక పరిస్థితులపై...