📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రెడ్డి జాగృతి జాతీయ ఉగాది సేవా పురస్కారం 2026 కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా...

రెడ్డి జాగృతి జాతీయ ఉగాది సేవా పురస్కారం 2026 కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి కి వరించింది

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి 14) హైదరాబాద్ కు చెందిన రెడ్డి గర్జన రెడ్డి జాగృతి ఫౌండేషన్ వారు పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుపుకొను సందర్భంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరిస్తున్న కార్యక్రమంలో భాగంగా గత మూడు దశాబ్దాలుగా నిరంతర సేవలు కొనసాగిస్తున్నందున ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారికి రెడ్డి గర్జన రెడ్డి జాగృతి ఫౌండేషన్ వారు గుర్రం పాపిరెడ్డి వాట్సాప్ ద్వారా పంపిన ధ్రువీకరణ పత్రము శనివారము బి యస్ నారాయణరెడ్డి అందుకున్నారు.ఈ ఆహ్వాన పత్రికలో ఈనెల 17న మంగళవారం రెడ్డి గర్జన రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో30 వేలకు పైగా తెలుగు ఉగాది క్యాలెండర్లు పదివేల తెలుగు ఉగాది డైరీలు విడుదల సందర్భంగా వేదిక పరిణయ కన్వెన్షన్ బ్రాహ్మణపల్లి రోడ్ ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్12 సాగర్ రోడ్డు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నందు ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే సాహితీ సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొని ఉగాది పురస్కారమును స్వీకరించాల్సి ఉందని రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు గుర్రం పాపిరెడ్డి స్వచ్ఛందంగా చేస్తున్న సేవలకు గాను ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా అవార్డ్స్ అందుకోవడం సుదూర దూరములో ఉన్న ఎన్జీవోలు మనమల్ని మనం చేస్తున్న సేవలను గుర్తించి అందిస్తున్నందులకు రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు గుర్రం పాపిరెడ్డి కి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా ఉగాది సేవా పురస్కారం పొందుతున్నందుకు స్నేహితులు గిద్దలూరు బద్వేల్ తాలూకా ప్రజలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు అభినందనలు తెలియచేశారని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.