📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఉరి అలా కాదు.ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో వీడియో...

ఉరి అలా కాదు.ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో వీడియో రికార్డు చేసిన భర్త…!!

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్(మార్చి14)కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో నివాసం ఉంటూ రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్అ తని భార్య కృష్ణవేణి గురువారం గొడవ పడ్డట్టు తెలిసింది.అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెబుతున్నారు.ప్రతిరోజు గొడవపడటం తర్వాత మామూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకున్నారు స్థానికులు కూడా.అయితే ఈసారి విధి వికటించింది. ఉరి రూపంలో కృష్ణవేణిని మృత్యు వెంటాడింది.ఉరి వేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది.అయితే ఆ ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నాడు.భార్య ఉరి వేసుకుంటుంటే కనీసం ఆమెను ఆపకపోగా.ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ తనకు సూచనలు చేస్తూ వీడియో రికార్డు చేశాడు.సరాదాగా భావించి తన భార్యను కాపాడుకోలేకపోయాడా లేక కావాలని ఆమెను ఉరిని ప్రేరేపించాడా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.కృష్ణవేణి మృతిపై ఆమె బంధువులు ఆగ్రహావేశాలకు లోనై శ్రీరామ్‌పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.అయితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అతని శిక్షించాలని వారు పట్టుబడ్డారు.దీంతో పోలీసులు ఇతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఉరి వేసుకుంటుంటే కనీసంఆపకపోగాచిత్రీకరించినభర్తశ్రీరామ్శ్రీనివాసులపైస్థానికులుమండిపడుతున్నారు .రాజంపేటలో భార్య ఉరివేసుకుంటుండగా అక్కడే ఉన్న భర్త ఆపకపోగా ఎలా ఉరి వేసుకోవాలో సూచిస్తూ వీడియో తీయడం కలకలం రేపుతోంది.ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.భార్యాభర్తల మధ్య గొడవలు అనేక కుటుంబాలలో కన్నీరుని మిగిల్చాయి.గొడవ జరిగిన తర్వాత ఆగ్రహావేశాలకు లోనై ఉరివేసుకొని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.అలాంటిదే ఇప్పుడు  కడప జిల్లా రాజంపేటలో జరిగింది.అయితే భార్య ఉరివేసుకుంటుంటే అక్కడే ఉన్న భర్త కాపాడకపోగా ఉరిఎలా వేసుకోవాలో భార్యకు వివరించిన వీడియో వైరల్‌గా మారింది.భార్య కృష్ణవేణి ఉరి వేసుకుంటుంటే కనీసం ఆపకపోగా వీడియో చిత్రీకరించిన భర్త శ్రీరామ్ శ్రీనివాసులు పై స్థానికులు మండిపడుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.