📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఉపాధి హామీ పథకం పై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు.

ఉపాధి హామీ పథకం పై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు.

📰 Generate e-Paper Clip

ఉపాధి హామీ పథకం పై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు.

బి కే యం యు జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే దాని పేరు మార్చి చట్టంలో అనేక మార్పులు చేసిందని తద్వారా పాత చట్టం యొక్క అసలు ఉద్దేశాలు నెరవేరకపోగా పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (భారతీయ కేక్ మజ్దూర్ యూనియన్ బి కే ఎన్ యు) హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే లక్ష్మణ్ విమర్శించారు. సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూలీలతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రం యొక్క భాగస్వామ్యాన్ని నిధుల కేటాయింపులో తగ్గింపు చేసుకొని రాష్ట్రాల పైనే భారం మోపడంతో ఉపాధి పని దినాలు తగ్గించడం తప్ప వేరే మార్గం లేదని వాస్తవం ఇది కాగా పని దినాలు పెంచడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు బిజెపి ప్రభుత్వం చెప్పడం అత్యంత సిగ్గుచేటైన విషయమని అన్నారు. రాష్ట్రాలు ఆర్థిక దివాలా పరిస్థితిలో దృష్ట్యా ఈ పథకానికి నిధుల కేటాయింపును మానుకుంటే అప్పుడు ఈ చట్టం ఎలా అమలవుతుందని విమర్శించారు. అందుకే పాత చట్టాన్ని యధావిధిగా అమలు పరచాలని, రోజు కూలి 700 రూపాయలకు తగ్గకుండా ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి పనిచేసే చోట సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు భూమిలేని పేదలను గుర్తించి అట్టి భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాలు, మండల కేంద్రాలు,గ్రామాలలో ప్రభుత్వ భూములలో పేదలు నివాసం ఉంటున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ధర్నా కార్యక్రమం అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ గారికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మునిగాల బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదునూరి వెంకటరాజ, సహాయ కార్యదర్శి బొట్టు బిక్షపతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి నాయకులు మాదాసు యాకూబ్, జూకంటి పద్మ, అలవాల రాజు, రాజన్న, సునీల్, రైతు సంఘం నాయకుడు మెట్టు శ్యాంసుందర్ రెడ్డి తదితరులతోపాటు వివిధ గ్రామాలకు కూలీలు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.