📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ఉద్యమ పోరాట స్ఫూర్తిని చాటుతూ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గురువారం పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో అన్ని మండలాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీక్షా దివస్ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ కమిటీలు, యువజన నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కార్యక్రమానికి సిద్ధం చేయాలని తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం, నిరాహార దీక్ష ప్రాధాన్యతను నేటి తరానికి వివరించాలని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని కార్యక్రమ విజయానికి కృషి చేయాలని, నాయకులంతా సమష్టిగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేలా దీక్షా దివస్ ను నిర్వహించాలని సూచించారు.

“తెలంగాణ కోసం సాగిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ఆ పోరాట స్ఫూర్తిని ప్రతి గుండెలో నింపుతూ దీక్షా దివస్ ను విజయవంతం చేయడమే మనందరి బాధ్యత” అని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి, బబ్బురి శ్రీకాంత్ గౌడ్, గాంధీ నాయక్, శ్రీనివాస్ రావు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.