📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకుల నిర్మూలన, సమానత్వమే రాజ్యాంగ లక్ష్యం చట్టం ముందు అందరూ సమానులే

కుల నిర్మూలన, సమానత్వమే రాజ్యాంగ లక్ష్యం చట్టం ముందు అందరూ సమానులే

📰 Generate e-Paper Clip

కుల నిర్మూలన, సమానత్వమే రాజ్యాంగ లక్ష్యం
చట్టం ముందు అందరూ సమానులే
కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 26 :
నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ జి. రమేష్ బాబు భారత రాజ్యాంగ పీఠికను చదివించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి దేశ ప్రజలకు అంకితం చేసిందని, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలిపారు. కుల నిర్మూలన, సమానత్వం రాజ్యాంగ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

అనంతరం ఎస్ఐ జి. ఉపేందర్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని అన్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచిందని, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కులను, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను రాజ్యాంగం కల్పించిందని వివరించారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పాలకులే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని మనుస్మృతితో పోల్చి ప్రకటించడం దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును తొలగించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకట్రాం, నరసయ్య, మాల మహానాడు నాయకులు గుండాల బిక్షం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మిడతపల్లి శ్రీలత, పంచాయతీ కార్యదర్శి బండి అశోక్, బీఆర్ఎస్ నాయకులు బండి రమేష్, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా సెక్రటరీ కొమిరె ఉపేందర్ మాదిగ, మాజీ సర్పంచ్ మందుల యాకన్న, కారోబార్ రమేష్, మందుల పరశురాములు, కొమిరె యాకయ్య, దూర్ శ్రీపాలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.