ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కాజీపేట ఏసీపీ
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌ను కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి గురువారం సాయంత్రం సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను, కేసులకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, నిర్వహిస్తున్న పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
పోలీసింగ్ వ్యవస్థ (విపీఓ), ఎన్డీపీఎస్ కేసులు, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు, కేసుల నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు,సలహాలు అందించారు.ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ,బాధితుల సమస్యలను సానుకూలంగా విని,చట్ట పరిధిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ శాఖ గౌరవం పెరిగేలా క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్,ఎస్ఐ నరసీంహరావు,ఏఎస్ఐ శంకర్,హెడ్ కానిస్టేబుల్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

