📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజుక్కల్ లో రాజ్యాంగ దినోత్సవం

జుక్కల్ లో రాజ్యాంగ దినోత్సవం

📰 Generate e-Paper Clip

జుక్కల్ లో రాజ్యాంగ దినోత్సవం

-ఇంద్రమ్మ బీమా ప్రారంభం.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 27

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. గ్రామ సర్పంచ్ సావిత్రి-సాయ గౌడ్ అధ్యక్షతన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ సావిత్రి-సాయి గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ సమక్షంలో ప్రారంభించారు.. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.. ఈ ఉప సర్పంచ్ ఫిర్దోస్ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ రాజు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.