📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు.. పెద్దమడూరులో పోలీస్ కళాజాతతో అవగాహన

డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు.. పెద్దమడూరులో పోలీస్ కళాజాతతో అవగాహన

📰 Generate e-Paper Clip

 

జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి): చిన్నపాటి సరదా కోసం మొదలయ్యే మత్తు అలవాటు, చివరకు జీవితాన్నే చీకటిమయం చేస్తుందని, కాబట్టి యువత డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ సూచనలతో దేవరుప్పుల మండలం పెద్దమడూరులో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పాసుగంటి గిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కళాజాత బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కళాకారులు పాటలు, యక్షగానం తరహా నాటికలతో గంజాయి, డ్రగ్స్ తాగితే కుటుంబం ఎలా రోడ్డున పడుతుందో, ఆరోగ్యం ఎలా పాడవుతుందో కళ్ళ ముందు చూపించారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి చదివిస్తుంటే, వ్యసనాలకు బానిసై వారి ఆశలను చిదిమేయవద్దని యువతకు సూచించారు.

మత్తు పదార్థాలు అమ్మే వారి గురించి తెలిసినా భయపడకుండా పోలీసులకు చెప్పాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రగిరి సంపత్, వార్డు సభ్యులు నాయకువు రచన, శేఖర్ గౌడ్, వరలక్ష్మి, శ్రీశైలం, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.