📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణలక్ష్మీదేవి ఆశీస్సులతో లోకాకళ్యాణం జరగాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు

లక్ష్మీదేవి ఆశీస్సులతో లోకాకళ్యాణం జరగాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు

📰 Generate e-Paper Clip

*లక్ష్మీదేవి ఆశీస్సులతో లోకాకళ్యాణం జరగాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు*

సర్పంచ్ దేశెట్టి పాటిల్ కార్యాలయంలో జరిగిన పూజలో ఎమ్మెల్యే హాజరు

జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): జాతీయ నెంబర్ 65 పక్కన గల ఉన్న న్యూ మహీంద్రా కాలనీలో గల గుంజేటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ కార్యాలయంలో లక్ష్మి పూజని పురస్కరించుకొని స్థానిక శాసన సభ సభ్యులు కొన్నింటి మాణిక్ రావు హాజరై లక్ష్మీదేవిని దర్శించుకొని ఆర్థికంగా, వ్యాపారపారంగా లక్ష్మీదేవి ఆశీస్సులతో సర్పంచ్ దేశెట్టి పాటిల్ మరింత వృద్ధి చెందాలని కాంక్షిస్తూ దేవి ఆశీస్సులు, కృపా, అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూజ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ చైర్మన్ నారోత్తం బృందానికి సర్పంచ్ దేశెట్టి పాటిల్ శాలువాకప్పి సత్కరించి వారికీ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిసిఏంఎస్ చైర్మన్ శివకుమార్, మండలాల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, నేతకానీ వెంకటేశం, డప్పుర్ రవీందర్, కౌన్సిలర్లు పెద్దబాయి మహిపాల్ యాదవ్, మొహమ్మద్ జకీర్, ప్రతినిధులు నామ రవికిరణ్, జియా గౌరీ, మొహమ్మద్ యాకుబ్, మొహమ్మద్ అబ్దుల్లా, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప యాదవ్, మాజీ కేతాకీ చైర్మన్ నర్సింహా గౌడ్, హద్నూర్ గ్రామ సర్పంచ్ మాతాంశెట్టి ప్రవీణ్, సర్పంచ్ ప్రతినిధి మొహమ్మద్ సోహైల్, నాయకులు, గుంజెటి గ్రామస్తులు, స్నేహ బృందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.