*ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం : కౌన్సిలర్ వకీల్ చవాన్*
*హోతి కె వార్డులో స్మార్ట్ కార్డులు పంపిణి చేసిన కౌన్సిలర్, అధ్యక్షులు షకీల్*
జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మున్సిపల్ కౌన్సిలర్ వకీల్ చవాన్ అన్నారు. అదివారం నాడు పట్టణంలోని 7 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వకీల్, అధ్యక్షులు షకీల్ పటేల్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ వకీల్ చవాన్, పార్టీ వార్డు అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ పటేల్, ఉపాధ్యక్షులు శేఖర్, సంగన్న లీడర్, నిసార్ పటేల్, డీలర్ అబ్దుల్ సమద్, రావుఫ్ పటేల్, వార్డు ప్రజలు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

