పోలీస్ అంటే లాఠీ కాదు ప్రజలకు భరోసా
డాక్టర్ దగ్గరకు మీరు వెళ్లక్కర్లేదు, డాక్టరే మీ ఊరికి వస్తున్నాడు
ఉచిత వైద్యం, ఉచిత మందు, ఉచిత భోజనం – ఇది పోలీస్ మనసు
గుత్తికోయ గుండె చప్పుడు వినడానికి వస్తున్న మెగా క్యాంప్
రక్షణే కాదు, ఆరోగ్యం కూడా మా బాధ్యత –
ఒక్క రోజు, ఒక్క క్యాంప్, మీ జీవితానికి భరోసా
పస్రా SI తాజుద్దీన్
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, మెగా మెడికల్ క్యాంప్ గోవిందరావుపేట గ్రామ ప్రజల కోసం. గుత్తికోయ గ్రామ ప్రజల కోసం ఈ నెల 28 న జరగనున్నదని ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాలతో, పస్రా సిఐ దయాకర్ సూచనలతో ఎస్సై తాజుద్దీన్ అధ్వర్యంలో జరగనుంది
ఈ సందర్భంగా SI గారి సందేశం..
మీ ఆరోగ్యం కోసమే, ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం
క్యాంప్ జరిగే స్థలం… పి. ఎస్. ఆర్. గార్డెన్స్, సోములగడ్డ.
క్యాంప్ జరిగే సమయం… ఉదయం తొమ్మిది గంటల నుండి, సాయంత్రం ఐదు గంటల వరకు.
ఈ క్యాంప్ లో, అన్నీ ఉచితమే.
మీ గ్రామం నుండి, క్యాంప్ వరకు ఉచిత రవాణా ఉంటుంది.
క్యాంప్ కు వచ్చిన వారందరికీ, ఉచిత భోజనం ఉంటుంది.
పరీక్షలు ఉచితం. మందులు ఉచితం.
బీపీ, షుగర్, గుండె, కళ్ళు… ఇలా అన్ని పరీక్షలు చేస్తారు.
నిపుణులైన వైద్యులు, మీ కోసం వస్తున్నారు.
పెద్దలు రండి. పిల్లలు రండి. తల్లులు రండి.
మీ ఆరోగ్య సమస్యను, నిర్లక్ష్యం చేయకండి.
పోలీసులు అంటే, కేవలం రక్షణ మాత్రమే కాదు. సేవ కూడా.
మీ కష్టంలో, మీతో ఉండటమే మా బాధ్యత.
గుత్తికోయ గ్రామాల్లో, వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వారికి, ఇది గొప్ప అవకాశం.
దయచేసి, మీ కుటుంబ సభ్యులందరినీ వెంట తీసుకురండి.
ఒక్క రోజు సమయం కేటాయించండి. మీ జీవితానికి భరోసా పొందండి.
మీ ఆరోగ్యం కోసం… మీ ములుగు జిల్లా పోలీస్, ఎప్పుడూ మీతోనే ఉంటుంది.

