📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవిద్యార్థులు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలి

విద్యార్థులు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలి

📰 Generate e-Paper Clip

*విద్యార్థులు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలి*

*మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి*

*ఝరాసంగం కస్తూర్బ ను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్జి కవితదేవి*

జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజా మలుపు): మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో కస్తూర్బ గాంధీ బాలికల హాస్టల్ విద్యార్థులకు అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి కవితదేవి నిర్వహించి విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించి చక్కగా చదువుకోవాలని, పెద్దలను తోటివారిని గౌరవించాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. బాలికల పట్ల, మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించిన వారు కఠిన శిక్షలకు లోనవుతారని తెలియ జేశారు. విద్యార్ధినులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఉపాధ్యాయులు మనకు దిశా నిర్దేశకులని, వారిని గౌరవించడం మన విధి అని తెలియజేసారు. ప్రతి విద్యార్ధి ఒక లక్షాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష సాధనకు ఉపాధ్యాయుల సహకారం తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు మరియు లీగల్ సర్వీసెస్ సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.