జహీరాబాద్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మున్సిపల్ కౌన్సిలర్ వకీల్ చవాన్ అన్నారు.
ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని 7వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వకీల్ చవాన్, వార్డు పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ పటేల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వకీల్ చవాన్, పార్టీ 7వ వార్డు అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ పటేల్, ఉపాధ్యక్షులు శేఖర్, సంగన్న లీడర్, నిసార్ పటేల్, రేషన్ డీలర్ అబ్దుల్ సమద్, రావుఫ్ పటేల్, వార్డు ప్రజలు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

