📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణముదిరాజుల హక్కులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా

ముదిరాజుల హక్కులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా

📰 Generate e-Paper Clip

ముదిరాజుల హక్కులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?

బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

జిల్లా ముదిరాజ్ మహా సభ కార్యదర్శి చొప్పరి సాగర్ ముదిరాజ్ డిమాండ్

మద్దూరు నవంబర్21, ప్రజా వాణి,

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం,తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి ముదిరాజుల ఐక్యతను చాటిచెప్పడం అభినందనీయమని సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్ ముదిరాజ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.ముదిరాజుల హక్కులు సాధించే వరకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఇతర వృత్తి సంఘాల కార్మికులకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందిస్తున్నప్పటికీ మత్స్యకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు, పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముదిరాజుల ఐక్యతే మన బలం…హక్కుల సాధనే మన లక్ష్యం”. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం ఆగదని చొప్పరి సాగర్ ముదిరాజ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.