📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమండల స్థాయి జూనియర్ ఒలింపియాడ్ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి

మండల స్థాయి జూనియర్ ఒలింపియాడ్ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి

📰 Generate e-Paper Clip

మండల స్థాయి జూనియర్ ఒలింపియాడ్ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి

ఎల్టా తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో సిరిసిటీ వశిఖర్ ప్రతిభ చాటింపు

ఓదెల, నవంబర్ 21, ప్రజావాణి ప్రతినిధి:

ఓదెల హైస్కూల్లో నిర్వహించిన ఎల్టా తెలంగాణ (ELTA Telangana) మండల స్థాయి పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోత్కపల్లి విద్యార్థి సిరిసిటీ వశిఖర్ ప్రథమ బహుమతి సాధించి ప్రతిభ చాటాడు. జూనియర్ ఒలింపియాడ్ పోటీలో ఏడవ తరగతి చదువుతున్న వశిఖర్ తన ప్రతిభ, నైపుణ్యంతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి వై. రమేష్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, విజ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థి సిరిసిటీ వశిఖర్‌కు మండల విద్యాధికారి వై. రమేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, అవార్డు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఓదెల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, శోభారాణి, అమృత కిషోర్, ప్రణీత, లింగమూర్తి, సమ్మయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థి సాధించిన విజయంపై పీఎం శ్రీ పాఠశాల పోత్కపల్లి ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.