📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి..!

ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి..!

📰 Generate e-Paper Clip

 

గిరిజన సర్పంచ్ పై దాడిని ఖండించిన ఎల్ఎచ్పిఎస్ , జివిఎస్ , బిఎచ్పిఎస్..

పాలకుర్తిలో గిరిజన సంఘాల నిరసన

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ పై జరిగిన దాడిని లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్ఎచ్పిఎస్), బంజారా హక్కుల పోరాట సమితి (బిఎచ్పిఎస్), గిరిజన విద్యార్థి సంఘం (జివిఎస్) నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు, గిరిజన సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ పై జరిగిన భౌతిక దాడి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ప్రజాప్రతినిధికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు, ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ముఖ్యంగా ఒక గిరిజన ప్రజాప్రతినిధిపై ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఈ దాడి వెనుక ఉన్న వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గిరిజన సర్పంచ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దాడికి పాల్పడిన వారిపై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.

గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని, బాధితుడికి న్యాయం జరిగే వరకు చట్టబద్ధమైన ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. గిరిజనుల ఆత్మగౌరవంపై దాడి అంటే రాజ్యాంగ హక్కులపై దాడిగా భావిస్తామని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాజ్ కుమార్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు వెంకట్ బంజారా నాయక్, బంజారా హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు వెంకట్ నాయక్ రాథోడ్, లంబాడా హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పున్నీ బాయి, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు నాయక్, బిఎచ్పిఎస్ జిల్లా నాయకులు జాటోత్ రాహుల్ నాయక్, గిరిజన జిల్లా నాయకులు మాజీ ఎంపీటీసీ లావుడ్య దేవేందర్ నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ధరావత్ యాకూబ్ నాయక్, బుక్యా సురేష్ నాయక్, జహీందర్ నాయక్, మాజీ సర్పంచ్ బానోతు మహేందర్ నాయక్, బానోత్ రవీందర్ నాయక్, బానోత్ రమేష్ నాయక్, బోడ రాజు నాయక్, సురేష్ నాయక్, నరేష్ నాయక్, బుక్య అంజన్న నాయక్, లావిడియా రవీందర్ నాయక్, లకావత్ మోతిలాల్ నాయక్, బోడా దేవోజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.