📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనషా ముక్త్ యువ వికాస్ క్రీడా పోటీలు...

నషా ముక్త్ యువ వికాస్ క్రీడా పోటీలు…

📰 Generate e-Paper Clip

నషా ముక్త్ యువ వికాస్ క్రీడా పోటీలు…
ప్రజావాణి,నెల్లికుదురు: నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1,యూనిట్–2 ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన ప్రారంభ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి pనోముల విజయకుమారి హాజరై, మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు ప్రతీకలని, విద్యార్థి దశలోనే మంచి అలవాట్లను అలవర్చుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు నషా ముక్త్ యువ సంకల్ప ప్రతిజ్ఞ చేశారు. తరువాత రన్నింగ్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, కబడ్డీ, ఖో-ఖో తదితర క్రీడా పోటీలు నిర్వహించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చక్కటి అవగాహన నాటికను ప్రదర్శించారు.

నషాముక్త్ యువ వికాస్ తో క్రమశిక్షణ

నషా ముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమం ఉద్దేశం యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు క్రమశిక్షణ అలవబడుతుందన్నారు.చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, జట్టుగా పనిచేసే స్వభావం, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు కవి రాజు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామ్మూర్తి, సుధాకర్, బాబు, సతీష్, యాకన్న అధ్యాపకేతర బృందం శ్రావణ్, ప్రదీప్, గౌరీ శంకర్, లక్ష్మణ్ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.