📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (143) పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే (143) నల్లగొండ మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో హెల్త్ కార్డుల సాధనతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి పిల్లల విద్యకు చేయూత అందించినట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ అల్లం నారాయణ ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రుల్లోనే పరిమితంగా అమలవుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కార్డులు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పోస్టుకార్డు కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీకి అభినందనలు టీయూడబ్ల్యూజే (143) నల్లగొండ మండల నూతన అధ్యక్షుడిగా చిక్కుల యాదగిరి (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా పేరం సుభాష్ (వార్తా వేదిక సూర్య) ఎన్నికైన సందర్భంగా వారిని జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోలి విజయ్‌కుమార్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, నరసింహమూర్తి, జిన్నే శ్రీనివాసరెడ్డి, పోగుల రమేష్, ముచ్చర్ల శ్రీనివాస్, కారింగు వెంకన్న, ఎర్రబెల్లి ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.