📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonతైక్వాండో ఛాంపియన్‌షిప్ - 2026 లో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ

తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026 లో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ

📰 Generate e-Paper Clip

*తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026 లో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి):
జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల ముగిసిన 6వ జనగామ జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026 పోటీలలో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

ఈ పోటీల్లో పాఠశాల నుండి మొత్తం 18 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలను కైవసం చేసుకున్నారు.

3 బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్), 4 రజత పతకాలు (సిల్వర్ మెడల్స్) తో పాటు మిగిలిన విద్యార్థులు కూడా తమ విభాగాల్లో రాణించి పతకాలు సాధించి పాఠశాలకు ఘన కీర్తి తెచ్చారు.

వివిధ విభాగాల్లో పతకాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు ప్రతిష్ట తెచ్చిన విద్యార్థులను మరియు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ / మాస్టర్ ఎండి. అబ్బాస్ ని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.

విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.