📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఫ్లెక్సీల మాటున మహాత్ముడు

ఫ్లెక్సీల మాటున మహాత్ముడు

📰 Generate e-Paper Clip

ఫ్లెక్సీల మాటున మహాత్ముడు
ప్లెక్సీలకు పరిమితమైన గాంధీ చౌరస్తా

* ఫ్లెక్సీల మాటున మహాత్ముడు
* గాంధీ జయంతి వేళైనా గాంధీజీకి గౌరవం దక్కేనా

* జమ్మికుంట ప్రధాన కూడలిలో కిక్కిరిసిన ఫ్లెక్సీలు

జమ్మికుంట, సెప్టెంబర్ 30 (ప్రజావాణి)

దేశానికి అహింస, సత్యం, శాంతి మార్గాలను చూపిన మహాత్మా గాంధీజీ విగ్రహం నేడు ప్రచార ఫ్లెక్సీల మధ్య కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడలిలో గాంధీజీ విగ్రహం చుట్టూ భారీగా ఏర్పాటు చేసిన వివిధ ఫ్లెక్సీలతో మహాత్ముని విగ్రహం ప్రజలకు సరిగా కనిపించని దుస్థితి నెలకొందిమరికొద్ది రోజుల్లో గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీజీని స్మరించుకోనున్న తరుణంలో జమ్మికుంటలో మాత్రం ఆయన విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కిక్కిరిసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. జయంతి రోజున పూలమాలలు వేసి నివాళులర్పించే విగ్రహం చుట్టూ మిగిలిన రోజుల్లో ఇలా ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారుప్రధాన కూడలిలో ఎటు చూసినా వివిధ కార్యక్రమాలు, జన్మదిన శుభాకాంక్షలు, రాజకీయ, సామాజిక ప్రచారాలకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. వాటి మధ్యలో గాంధీజీ విగ్రహం ఫ్లెక్సీల మాటున మహాత్ముడు అన్నట్లుగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుమహాత్మా గాంధీజీ చూపిన అహింస, సత్యం, పరిశుభ్రత వంటి విలువలను స్మరించుకోవాల్సిన గాంధీ జయంతి సమీపిస్తున్న వేళ కనీసం ఇప్పటికైనా విగ్రహం చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా గౌరవప్రదంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారుగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చే ప్రజలకు మహాత్ముని విగ్రహం స్పష్టంగా కనిపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇకపై విగ్రహ పరిస ఐ ఎం జి-20260930 డబ్ల్యూ ఏ0034రాల్లో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా నియంత్రణ విధించాలని స్థానికులు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.