📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గుగ్గిళ్ల ఇథనాల్ ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి విచారణ

గుగ్గిళ్ల ఇథనాల్ ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి విచారణ

📰 Generate e-Paper Clip

దుర్వాసన, కాలుష్యంపై ఫిర్యాదుతో పరిశ్రమ పరిసరాల పరిశీలన

స్థానికుల నుంచి సమస్యలపై వివరాలు సేకరించిన అధికారులు

బెజ్జంకి, సెప్టెంబర్ 24 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామ పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ వేస్ బయో ఎనర్జీ పరిశ్రమపై వచ్చిన ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు భాగ్యలక్ష్మి, రవీందర్ పరిశ్రమ పరిసరాలను పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.  ఈ యొక్క దుర్వాసనతో  పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో బెజ్జంకి, కోహెడ మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిమ్మాయపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు మేకల శ్రీధర్ అధికారులకు తెలిపారు. దుర్వాసన కారణంగా వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు.దుర్వాసనతో పాటు వాతావరణం, నీరు, శబ్ద కాలుష్యంపై సుమారు పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు మ్యాకల శ్రీధర్ తెలిపారు. గతంలో పరిశ్రమ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల గొర్రెలు, చేపలు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు స్థానికుల నుంచి సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. విచారణ అనంతరం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.