📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మానవత్వం చాటుకున్న 24 వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్

మానవత్వం చాటుకున్న 24 వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

మానవత్వం చాటుకున్న 24 వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్

చింటూ కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సహాయం

చింటూను పరామర్శించి కుటుంబానికి భరోసా

ఎల్లంపేట (ప్రజావాణి):- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నివసిస్తున్న వడ్డే కృష్ణ, అరుణ దంపతుల కుమారుడు చింటూకు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వారి ఇంటికి వెళ్లి చింటూను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా చింటూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చింటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, అవసరమైన సమయంలో వారికి సహాయం అందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అర్చన శ్రీనివాస్ పేర్కొన్నారు. చింటూ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని ఆమె మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

తమ కుమారుడిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్‌కు వడ్డే కృష్ణ, అరుణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.