📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపదేళ్లలో YTPSకు ఏం చేశారు

పదేళ్లలో YTPSకు ఏం చేశారు

📰 Generate e-Paper Clip

పదేళ్లలో YTPSకు ఏం చేశారు? అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

మిర్యాలగూడ నియోజకవర్గం సెప్టెంబర్ 25

* నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో *తెలంగాణ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్* మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై మాజీ మంత్రి ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి హయాంలో YTPSకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులపై ప్రజలకు వివరించాలని శంకర్ నాయక్ ప్రశ్నించారు. అప్పట్లో ప్లాంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు.
జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లిన సందర్భంగా ఏకలింగంపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను ప్రస్తావిస్తూ *శంకర్ నాయక్* తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఒక ఎకరం కూడా లేని వ్యక్తి వందల ఎకరాలు ఎలా సంపాదించాడు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు, అవి ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు వచ్చి నీతులు చెబుతున్నారా?” అంటూ ఏకలింగాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.
“కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇటీవల జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లినప్పుడు మీరు చేసిన భూవ్యవహారాలపై ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పకుండా YTPS వద్దకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు” అని శంకర్ నాయక్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో YTPSను ఉత్పత్తిలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని శంకర్ నాయక్ తెలిపారు. పర్యావరణ అనుమతులు, పబ్లిక్ హియరింగ్ తదితర అంశాలపై చర్యలు తీసుకుని ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు.
ల్యాండ్ లూజర్లకు ఉద్యోగాలపై ప్రశ్నలు

YTPS కోసం భూములు కోల్పోయిన కుటుంబాల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని శంకర్ నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ లూజర్లకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల విషయంలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్లాంట్‌కు అవసరమైన నాణ్యమైన బొగ్గు సరఫరాపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. సింగరేణి నుంచి అవసరమైన నాణ్యత, పరిమాణంలో బొగ్గు అందుబాటులో లేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరా చేసే అంశంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
“ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చింది గత ప్రభుత్వమే”
“ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చింది మేము కాదు.. గత ప్రభుత్వమే. ప్లాంట్ నిర్మాణం, కాంట్రాక్టులు, బొగ్గు సరఫరా వంటి అంశాలపై అప్పట్లోనే నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది” అని శంకర్ నాయక్ అన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో సమస్యలను పరిష్కరించకుండా, ఇప్పుడు వాటిని రాజకీయ అంశాలుగా మార్చడం సరికాదని పేర్కొన్నారు.
భూకబ్జా ఆరోపణలపై తీవ్ర వ్యాఖ్యలు
“ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏకలింగాన్ని వెంట పెట్టుకుని ఇప్పుడు ప్రజలకు నీతులు చెప్పడం సిగ్గుచేటు” అని శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు.
భూమికి జానెడు కూడా సంబంధం లేకపోయినా భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వెంట పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది?” అంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని ప్రశ్నించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు”
గత పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో YTPS అభివృద్ధికి ఏం చేశారో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం YTPSను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు” అని శంకర్ నాయక్ అన్నారు.
YTPS అభివృద్ధి, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని *ఎమ్మెల్సీ శంకర్ నాయక్* కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.