గుగ్గిళ్ల ఇథనాల్ ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి విచారణ

దుర్వాసన, కాలుష్యంపై ఫిర్యాదుతో పరిశ్రమ పరిసరాల పరిశీలన స్థానికుల నుంచి సమస్యలపై వివరాలు సేకరించిన అధికారులు బెజ్జంకి, సెప్టెంబర్ 24 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామ పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ వేస్ బయో ఎనర్జీ పరిశ్రమపై వచ్చిన ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు భాగ్యలక్ష్మి, రవీందర్ పరిశ్రమ పరిసరాలను పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.  ఈ యొక్క దుర్వాసనతో  పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో బెజ్జంకి, కోహెడ...