📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఅల్లవాడ వినాయకుడి లడ్డూ వేలంలో రూ.1.76 లక్షలు

అల్లవాడ వినాయకుడి లడ్డూ వేలంలో రూ.1.76 లక్షలు

📰 Generate e-Paper Clip

అల్లవాడ వినాయకుడి లడ్డూ వేలంలో రూ.1.76 లక్షలు

లడ్డూను కైవసం చేసుకున్న యాలాల నరసింహారెడ్డి

రంగారెడ్డి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 25, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడిని శుక్రవారం భక్తుల సమక్షంలో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వినాయక మండపం వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో అల్లవాడ గ్రామానికి చెందిన యాలాల నరసింహారెడ్డి రూ.1,76,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య, ఉపసర్పంచ్ చింతకింది మధుసూదన్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.