పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
వల్లంపట్ల గ్రామ సర్పంచ్ కర్నె సునీత మనోహర్
మద్దూరు సెప్టెంబర్ 25, ప్రజా వాణి,
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్ కర్నే సునీత మనోహర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మనోహర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి సోకకుండా మన చుట్టు నిల్వ నీటిని లేకుండ చూసుకోవాలన్నారు.వర్ష కాలంలో సంక్రమించే వ్యాధులను తరిమి కొట్టాలంటే మన చుట్టు ఉన్న పరిసరాలను ప్రతి కుటుంబం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ ఉపసర్పంచ్ మాచర్ల రఘు,వార్డు సభ్యులు వేల్పుల రజిత,నల్లగొప్పుల రాజు, గుండెగోని స్వాతి రాకేష్,మల్లిగారి రంజిత్, ఏ ఎన్ఎం,ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

