• పరిశుభ్రమైన నగరం–పచ్చని నగరం లక్ష్యంగా స్వచ్ఛత, పర్యావరణ కార్యక్రమాలు
• మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో విస్తృత స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు*
మంగళగిరి సెప్టెంబర్ 19 ప్రజావాణి–తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగర పరిధిలో విస్తృత స్థాయిలో స్వచ్ఛత, పారిశుద్ధ్య, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సీతానగరం పుష్కర ఘాట్, ఉండవల్లి అన్న క్యాంటీన్, SLNS కాలనీ సమీపంలోని NH-16 సర్వీస్ రోడ్డులోని CTUలు, మంగళగిరి రాజీవ్ సెంటర్‌లోని రవీంద్ర భారతి హైస్కూల్, కాజా ఈస్ట్ లేక్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో పరిశుభ్రత, చెత్త విభజన, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.తొలుత మంగళగిరి రాజీవ్ సెంటర్‌లోని రవీంద్ర భారతి హైస్కూల్‌లో మూలంలోనే చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు తమ ఇళ్లలోనే కాకుండా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రజలకు కూడా చెత్త విభజనపై అవగాహన కల్పించాలని సూచించారు, తదుపరి సలన్స్ కాలనీ సమీపంలోని NH-16 సర్వీస్ రోడ్డులోని సీటు ల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిర్వహించే చెత్త సేకరణ వ్యవస్థకు సహకరించాలని అధికారులు సూచించారు.కమిషనర్ అలీమ్ బాషా మాట్లాడుతూ, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించేందుకు మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, వృక్షారోపణ, నీటి వనరుల పరిశుభ్రత, మూలంలోనే చెత్త విభజనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర పద్మశాలియ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య గారు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ నగర పారిశుద్ధ్య వ్యవస్థకు సహకరించాలని సూచించారు,అనంతరం టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, పోతినేని శ్రీనివాసరావు స్వచ్ఛత కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడటం, పార్కులు, రహదారులు, చెరువులు, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు సహకరించాలని కోరారు.స్వచాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భులాక్ష్మి గారు మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ నగర పారిశుద్ధ్య వ్యవస్థకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కమీషనర్ కె వెంకటేశ్వరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, మంగళగిరి టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, ఆల్ ఇండియా హిందీ బోర్డ్ డైరక్టర్ కాండ్రు భాను కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, బట్ట చిదానంద శాస్త్రి, సతీష్ కళాశాల యాజమాన్యం, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి ఘాట్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ప్రజలు, సందర్శకులు చెత్తను బహిరంగంగా వేయకుండా నిర్దేశిత విధానంలోనే వ్యర్థాలను పారవేయాలని సూచించారు. పుష్కర ఘాట్ వంటి ప్రజలు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించేందుకు ప్రజల సహకారం అవసరమని అధికారులు తెలిపారు.డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై మరింత చైతన్యం పెరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నగర పాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు.ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరాన్ని నిర్మించి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పాల్గొన్న ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు, సెక్రెటరి శ్రీనివాసరావు,డి.ఈ.ఈ రాము, పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు,నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ,జనసేనపార్టి,తాడేపల్లి పట్టణ అద్యక్షుడు అంబటి తిరుపతిరావు గారు,కూటమి నాయకులు,పాఠశాల విద్యార్థులు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.మంగళగిరి కాజా ఈస్ట్ లేక్ వద్ద నీటి వనరుల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. చెరువులు, నీటి వనరుల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా వాటి పరిశుభ్రతను కాపాడాలని ప్రజలకు సూచించారు. నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు.అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నగరంలోని ప్రతి వార్డులో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు తడి, పొడి చెత్తను మూలంలోనే వేరు చేసే విధంగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ప్రదేశాలు, పార్కులు, రహదారులు,
నీటి వనరుల పరిశుభ్రతను కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.పార్క్ పరిసరాల్లో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి, వాటర్ బాడీని శుభ్రపరిచారు. అనంతరం అందరూ కలిసి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. చెరువులను, పబ్లిక్ పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో PACS చైర్మన్ గాదె పిచ్చిరెడ్డి, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, గ్రామ అధ్యక్షులు కుక్కమళ్ళ విక్రమ్ , సూపరింటెండెంట్ ఇంజనీర్ లీలాకృష్ణ ప్రసాద్, ఏఈ ప్రసన్నజ్యోతి, ఇంజనీరింగ్ సిబ్బంది, SHG మహిళలు మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లి ఉండవల్లి అన్న క్యాంటీన్ వద్ద వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు విస్తృతంగా వృక్షారోపణ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ మల్లికా,ఉద్యాన అధికారి రామారావు,డ్వాక్రా మహిళలు, దాసరి కృష్ణ, వంగా నరేంద్ర, గాదె బసివి రెడ్డి, బుజ్జి, కునాపరెడ్డి రమేష్,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు,కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పాల్గొన్న ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, తడి–పొడి చెత్తను వేరు చేస్తూ,పర్యావరణ పరిరక్షణకు కృషి చేసి స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు.

