📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకొండాపూర్‌లో రేసు ఫ్యామిలీ గణనాథుడికి ప్రత్యేకపూజలు

కొండాపూర్‌లో రేసు ఫ్యామిలీ గణనాథుడికి ప్రత్యేకపూజలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ఘట్కేసర్ మండల పరిధిలోని కొండాపూర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి పుష్పాలు, పండ్లు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ సందర్భంగా రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.