ఘట్‌కేసర్, ఆగస్టు 09: యువజన కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొన్నం తరుణ్ గౌడ్ నాయకత్వంలో, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మకు అజయ్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది.
మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు ఆకిటి యుగేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కేశపాగుల వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ యువత కేవలం భవిష్యత్తు కోసం ఎదురు చూసే శక్తి కాదని, నేటి సమాజంలో మార్పు తీసుకురాగల చోదకశక్తి అని అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఐకమత్యంతో, క్రమశిక్షణతో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని, స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజ సేవకు యువత ముందుకు రావాలని సూచించారు. ఐక్యతే బలంగా, పోరాటమే నినాదంగా, ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు.
యువత అంతా ఒక్కతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వినయ్, భాను, అఖిల్, మల్లేష్, ప్రవీణ్, గణేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.

