ఘట్‌కేసర్, ఆగస్టు 9: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామి బోనాల పండుగను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కురుమ సంఘం అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బైర ఐలయ్య కురుమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో బీరప్ప స్వామికి బోనాలు సమర్పించారు. శివసత్తుల ఆటపాటలు, ఒగ్గు కళాకారుల డోలు సప్పుల నడుమ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు బైర ఐలయ్య కురుమ మాట్లాడుతూ.. బీరప్ప స్వామి కురుమలందరినీ చల్లగా చూడాలని, ప్రజలందరినీ సుఖసంతోషాలతో ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
బోనాల పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కాలనీవాసులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి బీరప్ప స్వామిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌జీకే కాలనీ కురుమ సంఘం ఉపాధ్యక్షుడు మేకల యాదగిరి కురుమ, కార్యదర్శి మద్దూరి శ్రీను కురుమ, సంయుక్త కార్యదర్శి దిద్దిగా కనకయ్య కురుమ, కోశాధికారి నరిగె నాగరాజు కురుమ, సహాయ కోశాధికారి మంతపూరి కోటేష్ కురుమ, కార్యనిర్వాహక సభ్యులు బుగ్గ పర్వతాలు కురుమ, గోపాల్ కురుమతో పాటు ఆర్‌జీకే కాలనీ కురుమ సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

