యువజన కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహణ….యువతే సమాజ మార్పుకు చోదకశక్తి: కేశపాగుల వినోద్ కుమార్
ఘట్‌కేసర్, ఆగస్టు 09: యువజన కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొన్నం తరుణ్ గౌడ్ నాయకత్వంలో, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మకు అజయ్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు ఆకిటి యుగేందర్ రెడ్డి అధ్యక్షతన...