📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబంజారాల జెండా పండుగలో ప్రత్యేక పూజలు....ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

బంజారాల జెండా పండుగలో ప్రత్యేక పూజలు….ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 09: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపూర్ గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండాలో బంజారాల సంప్రదాయ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. తండాలోని శ్రీశ్రీశ్రీ జగదాంబ దేవి సహిత శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

తండా ప్రజల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై జగదాంబ మాత అమ్మవారిని, సేవాలాల్ మహారాజ్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండా ప్రజలకు జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్ సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, తండా నాయక్ వడ్త్యా రాజు నాయక్, కారోబారి నానావత్ హుస్సేన్ నాయక్, పూజారి రామావత్ అమర్ సింగ్ నాయక్, మాజీ వార్డు సభ్యులు వడ్త్యా జైందర్ నాయక్, వడ్త్యా చాంది, బానోత్ కిషన్ నాయక్, నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణీ, వడ్త్యా పవన్ నాయక్, సొసైటీ బ్యాంకు మాజీ డైరెక్టర్ మహేందర్ నాయక్, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి నానావత్ శివాజీ నాయక్, రామావత్ చందర్ సింగ్, వడ్త్యా సురేష్ నాయక్, బానోత్ దేవేందర్ నాయక్, వడ్త్యా దేవు సింగ్ నాయక్, మాలోత్ సురేష్ నాయక్, నానావత్ కిషోర్ నాయక్, వడ్త్యా చిట్టీ బాబు నాయక్, బానోత్ శివరాజ్ నాయక్, గుగులోత్ సుమన్ నాయక్ తదితరులతో పాటు తండా ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.