ఆర్టీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకులు
హసన్పర్తి: రీపోటర్ ప్రణయ్ గొర్రె :
ఆర్టీసీ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకులు
హసన్పర్తి: రీపోటర్ ప్రణయ్ గొర్రె :
వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 1వ డివిజన్ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట ఆర్టీసీ కాలనీ, పద్మశాలి కాలనీలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిర్ర రాము గౌడ్ మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గతంలో కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ కాలనీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం అయితే పరిసరాలు పరిశుభ్రంగా, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరకొండ అనిల్, బోడ సారంగపాణి, మూల తిరుపతి, మూల నరోత్తం, వీసం సురేందర్, డబ్బా శ్రీను, భరత్ శ్రీనివాస్ తదితరులతో పాటు ఆర్టీసీ కాలనీ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 1వ డివిజన్ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట ఆర్టీసీ కాలనీ, పద్మశాలి కాలనీలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిర్ర రాము గౌడ్ మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గతంలో కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ కాలనీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం అయితే పరిసరాలు పరిశుభ్రంగా, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరకొండ అనిల్, బోడ సారంగపాణి, మూల తిరుపతి, మూల నరోత్తం, వీసం సురేందర్, డబ్బా శ్రీను, భరత్ శ్రీనివాస్ తదితరులతో పాటు ఆర్టీసీ కాలనీ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.