స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
ఎమ్మెల్యే సమక్షంలో రేపాక కాలనీ గ్రామంలో60 కుటుంబాలు టిడిపిలో చేరిక
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 16
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ కూనవరం మండలంలొ ముల్లూరు గ్రామంలో దిమ్మ ఓపెనింగ్ జెండ ఆవిష్కరించటం జరిగింది తర్వాత ముల్లూరు లొ అచ్చ సత్యనారాయణ ఆక్సిడెంట్ లో మరణించడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షలు ఇన్సూరెన్స్ రావడం జరిగింది వాళ్ల ఇంటికి వెళ్లి చెక్ ఇవ్వటం జరిగింది కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి అన్నారు కూనవరం మండలంలో ఆమె పర్యటించారు మండలంలోని రేపాక కాలనీ గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన 60 కుటుంబాలు టిడిపిలో చేరాయి ఎమ్మెల్యే శిరీష దేవి వారికి మెడలో టిడిపి కండవాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి నియోజకవర్గ అబ్జర్వేర్ సత్తిబాబు గారు ఎన్నికల అబ్జర్వేర్ బాలాజీ గారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు
ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించింది అన్నారు గతంలో వైసిపి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగించిందని ఆ విధంగా ప్రజలు అనేకంగా నష్టపోయారన్నారు వైసిపి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తూ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రజలు గుర్తిస్తున్నారన్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టులను నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది అన్నారు పోలవరం ప్రాజెక్టు కారణంగా రైతులకు అనేక విధాలుగా ప్రయోజనాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే బాబురమేష్ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కర్ రావు పోడియం అప్పారావు క్లస్టరు మోసం రాము కోశాధికారి సోమక సత్యనారాయణ మాజీ మండల పార్టీ అధ్యక్షులు బరపాటి ప్రకాశరావు మాజీ మండల అధ్యక్షులుగడేసుల ప్రేమ్ చంద్ శ్రీమంతుల సతీష్ కో క్లస్టర్ రసూల్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మడకం చిన్ని సొసైటీ సొసైటీ చైర్మన్ తోటకూరి వెంకన్న మండల రైతు ప్రధాన కార్యదర్శి తుంగల కన్నారావు మండల కమిటీ సభ్యులు యూనిటీ ఇన్చార్జిలు బూతు ఇన్సాజీలు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
