దాచారంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన-
సర్పంచ్ బైరా మానస రాజేందర్
బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో గురువారం తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బైరా మానస రాజేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక ప్రాధాన్యతను స్మరించుకుంటూ దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలు, ఐక్యతను కాపాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్సు, పంచాయతీ కార్యదర్శి సురేష్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
