📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కలసపాడు మండలంలో బలమైన పెనుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం...

కలసపాడు మండలంలో బలమైన పెనుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (మే20 ప్రజావాణి) కలసపాడు మండలంలో బలమైన పెనుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.పిడుగుపల్లె సబ్‌స్టేషన్ పరిధిలోని రంపాడు రోడ్డు మార్గంలో ఎక్కువగా నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది రాత్రి సమయంలోనే ఘటనాస్థలాలకు చేరుకుని విరిగిపోయిన స్తంభాలను గుర్తించే పనులు చేపట్టారు.ఇప్పటివరకు మొత్తం 9 విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు గుర్తించిన అధికారులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.