📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. పట్టుదల ఉంటే విద్యార్థులు విజేతలవుతారు!"ఐఐటి మ్యా క్ స్పీడ్ సీ...

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. పట్టుదల ఉంటే విద్యార్థులు విజేతలవుతారు!”ఐఐటి మ్యా క్ స్పీడ్ సీ ఓకే  టాలెంట్ టెస్టు –2 లో నిర్మలా కాన్వెంట్ విద్యార్థుల ఘన విజయం

📰 Generate e-Paper Clip

టాప్ 1–3 ర్యాంకులతో సత్తా చాటిన విద్యార్థులు

ప్రకాశం జిల్లా పొదిలి  సెప్టెంబర్ 20 ప్రజావాణి పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ నిర్మలా కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఐఐటి మ్యా క్ స్పీడ్ సీ ఓ కే  2 టాలెంట్ టెస్ట్‌లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు టాప్ 1–3 ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించారు.

9వ తరగతి కవలకుంట్ల. కౌశిక్ – 1వ ర్యాంక్ జి. కార్తీక్ – 2వ ర్యాంక్,K. జెన్నిఫర్ – 2వ ర్యాంక్, బి. ఆకాశ్ – 3వ ర్యాంక్

8వ తరగతి: అనీష్ వరుణ్ – 1వర్యాంక్, యెస్సినా ఫ్లోరెన్స్ – 2వర్యాంక్, రెనెటా – 3వ ర్యాంక్

7వ తరగతి కవలకుంట్ల. కార్తీక్ – 1వ ర్యాంక్, ఎస్.కె . హంహాద్ – 2వ ర్యాంక్,ఓ. ధీరజ్ – 3వ ర్యాంక్

6వ తరగతి ఆరాధ్య – 1వ ర్యాంక్, ఎన్. లలిత్ సాయి – 2వ ర్యాంక్, ఏ. సుదీప్ – 3వ ర్యాంక్

గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, పట్టుదలతో జాతీయ స్థాయి విద్యా పోటీ పరీక్షల్లోనూ అద్భుత ప్రతిభ కనబరచగలరని ఈ విద్యార్థులు నిరూపించారు. చిన్న వయసు నుంచే పోటీ పరీక్షలకు అవసరమైన జ్ఞానం, తార్కిక ఆలోచనా శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకుంటూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

విద్యార్థుల విజయంపై తల్లిదండ్రుల హర్షం

తమ పిల్లలు అత్యుత్తమ ర్యాంకులు సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఈ స్థాయిలో తీర్చిదిద్దిన నిర్మలా కాన్వెంట్ యాజమాన్యానికి, హెడ్‌మిస్ట్రెస్‌కు, సిస్టర్స్‌కు మరియు ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

మంచి స్థాయిలో తీర్చిదిద్దుతాం – హెడ్మాస్టర్  సిస్టర్ రాణివిద్యార్థుల ఘన విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ , సిస్టర్స్ మరియు ఉపాధ్యాయులు విజేతలను మెడల్స్‌తో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా సిస్టర్ రాణి మాట్లాడుతూ,కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనా శక్తి మరియు ప్రతిభను వెలికితీయడమే నిర్మలా కాన్వెంట్ ముఖ్య ఉద్దేశం.భవిష్యత్తులో కూడా విద్యార్థులను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన శిక్షణ, విద్యా వసతులను అందిస్తూ మంచి స్థాయిలో తీర్చిదిద్దుతాం అని తెలిపారు.విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన అన్ని రకాల విద్యా వసతులు, ప్రత్యేక శిక్షణను నిరంతరం అందిస్తామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.