అభినయ ట్రస్టు ఆధ్వర్యంలో సంగెం మండలంలోని గణేశ్ ఉత్సవ సమితులకు ఘన సత్కారం
సెప్టెంబర్ 20 ప్రజావాణి న్యూస్/సంగెం
సంగెం మండల పరిధిలో సుమారు 120 విఘ్నేశ్వర మండపాలలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అభినయ ట్రస్టు ఫౌండర్ & చైర్మన్ అన్నమనేని సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రస్టు కమిటీ సభ్యులు మిత్రబృందం కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించి, ఉత్సవ సమితులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు యజ్ఞాలు హోమాలు నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను పరిశీలించారు.
ప్రోత్సాహక బహుమతులు
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఉత్సవ సమితులను ప్రోత్సహించేందుకు
ప్రథమ బహుమతి – ₹10,116
ద్వితీయ బహుమతులు 5 ఉత్సవ సమితులకు ఒక్కొక్కరికి ₹5,116
అదేవిధంగా మండలంలోని ప్రతి గణేశ్ ఉత్సవ సమితిని మెమెంటో/షీల్డ్, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.
ప్రముఖుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో సంగెం మండలానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి మాస్టర్ జీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ సుందర్రాజు యాదవ్ గారు, విశిష్ట అతిథి శ్రీ చైతన్యానంద జీ స్వామీజీ పాల్గొన్నారు.అలాగే కాపులకనపర్తి గ్రామ సర్పంచ్ చంద్రమౌళి ఆశాలపల్లి గ్రామ సర్పంచ్ కిషోర్ బీజేపీ మండల అధ్యక్షులు చంద్రమౌళి బుట్టి కుమారస్వామి నరసింహారెడ్డి వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఉత్సవ సమితుల గౌరవ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.21, 22, 23 తేదీల్లో ప్రత్యేక పరిశీలనగణేశ్ నవరాత్రుల 7వ, 8వ, 9వ రోజుల్లో (21, 22, 23 తేదీలలో) మండలంలోని వివిధ గణేశ్ మండపాలను సందర్శించి, అక్కడ నిర్వహించే కార్యక్రమాలను పరిశీలించి, వాటి ఆధారంగా తదుపరి ప్రోత్సాహక బహుమతులను ప్రకటించడం జరుగుతుంది.అభినయ ట్రస్టు భవిష్యత్తులో కూడా ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు, యువతకు సమాజానికి అండగా నిలుస్తుందని ట్రస్టు ఫౌండర్ & చైర్మన్ అన్నమనేని సంతోష్ కుమార్ తెలిపారు
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పత్రికా మిత్రులు వివిధ సంఘాల ప్రతినిధులు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు గణేశ్ ఉత్సవ సమితుల సభ్యులకు అభినయ ట్రస్టు తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలుతెలియజేస్తున్నాము.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రతి ఉత్సవ సమితి సభ్యులకు అభినయ ట్రస్టు తరఫున హృదయపూర్వక నమస్కారాలు.
అభినయ ట్రస్టు
ఫౌండర్ & చైర్మన్
అన్నమనేని సంతోష్ కుమార్
[9/20, 5:23 PM] S: అలాగే వరంగల్ మహానగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర, వరంగల్ నగర మరియు వివిధ స్థాయిల బాధ్యులు ప్రత్యేక అతిథులుగా పాల్గొని కార్యక్రమానికి తమ ఆశీస్సులు, అందించారు.

