📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవార్డుల్లో మౌలిక వసతుల కల్పనాలకు కృషి చేస్తున్నాం

వార్డుల్లో మౌలిక వసతుల కల్పనాలకు కృషి చేస్తున్నాం

📰 Generate e-Paper Clip

*వార్డుల్లో మౌలిక వసతుల కల్పనాలకు కృషి చేస్తున్నాం*

*పట్టణ అభివృద్ధి కోసం త్వరలో మరిన్ని గ్రంట్లు మంజూరు*

*జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం*

*పట్టణ అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం : ఎంపీ సురేష్ షేట్కార్*

*11 వ వార్డులో 25 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు భూమిపూజా*

*కార్యక్రమంలో హాజరైన చైర్మన్ యునుస్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్*

జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): వార్డుల్లో మౌలిక వసతుల కల్పనల కోసం చేస్తున్నామని, ప్రజ సంక్షేమం కోసం ఎంత దూరమైనా ముందుకు వెళ్తామని, పట్టణన్ని సమూలంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూన్నమని పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ అన్నారు. మంగళవారం నాడు మున్సిపాలిటీ టౌన్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన 45 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో ఎంపీ షెట్కర్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఇంచార్జ్ డా చంద్రశేఖర్, డా ఉజ్వల్ రెడ్డి లు భూమిపూజా నిమిత్తం టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఇంచార్జ్ డా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు, పట్టణ అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పలు వార్డుల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయి.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావడం, పట్టణంలోని ప్రతి వార్డుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించడం కాంగ్రెస్ ప్రజా పాలన లక్ష్యం అని అన్నారు.

కార్యక్రమంలో జహీరాబాద్ మునిసిపల్ చైర్మెన్ యూనుస్, సీడీసీ ఛైర్మెన్ ముబీన్, వైస్ చైర్మన్ శిరీష రెడ్డి, కమిషనర్ ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ ఖాజామియా , కౌన్సిలర్లు పెద్దబాయి మహిపాల్, గౌస్ గౌరీ, మొహమ్మద్ అతిక్, రంగా అరుణ్ కుమార్, మొహమ్మద్ జమిల్, నిజాం, కౌన్సిలర్ల ప్రతినిధులు మొహమ్మద్ అబ్దుల్లా, యాకుబ్, మొహమద్ అక్రమ్, మొహమ్మద్ జఫర్, మొహమ్మద్ జావీద్, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, 11 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జ్ మొహమ్మద్ నవీద్, 19 వ వార్డు ఇంచార్జ్ పి అరవింద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.