పలు గ్రామాలలోని బస్టాండ్లలో టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని నుండి పెద్దపల్లి వెళ్లే దారిలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు బస్టాండ్లలో సౌకర్యాలు లేకపోవడం ముఖ్యంగా బేగంపేట్ సెంటనరీ కాలనీలో మూత్రశాలలు లేక మహిళలు చాలా ఇబ్బందికి గురవుతున్నార బహుజన సమాజ్ పార్టీ మంథని అసెంబ్లీ అధ్యక్షుడు జనగామ రవి అన్నారు కల్వచర్ల కమాన్ పూర్ గుండారం గ్రామాల ప్రజలు బస్సుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో టాయిలెట్స్ (మూత్రశాలలు) లేక మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలు అదే విధంగా కాలేజీ స్కూల్స్ కి వెళ్లే పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా కల్వచర్ల గ్రామంలో బస్టాండ్ లేక ఎండకు ఎండుతూ వానకు నానుతూ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే బస్టాండులునిర్మించి టాయిలెట్స్ నిర్మించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం బేగంపేట్ ఎక్స్ రోడ్డులో అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలు రద్దీగా ఉంటుంది ముఖ్యంగా చాలా దూర ప్రయాణాలు చేసి వస్తారు అక్కడ మూత్రశాలలు వెంటనే నిర్మించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము సంబంధిత అధికారులను మరియు ఆర్ అండ్ బి అధికారులను కోరుచున్నాము వీటిపై మన నియోజకవర్గం నుండి గెలిసినటువంటి ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చొరవ చూపించాలని కోరుతున్నాము

