📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా – కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా – కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం

📰 Generate e-Paper Clip

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా – కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం
జానకి నగర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం
జానకి నగర్, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై జానకి నగర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో రూపొందించబడిందని వివరించారు.
ప్రజల సంక్షేమం, కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోందని, గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని ప్రయోజనాలు పొందాలని సర్పంచ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాఘవేందర్ నాయక్, ఏయి నాగరాజు గారు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.