జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీకి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ మద్దతు:
(ప్రజావాణి ప్రతినిధి) నవంబర్ 24 :
జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని చెన్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మూడవరోజు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నే సురేందర్ తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వలన భూగర్భ జలాలు కలుషితమై త్రాగునీరు సాగునీరు కాలుష్యం అవుతుందని, డంపింగ్ యార్డ్ వల్ల ఏర్పడే మీతేను వాయువు పీల్చుకొని ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ మొదలగు వ్యాధులు వస్తున్నాయని, అదేవిధంగా మనిషి సగటు జీవితకాలం తగ్గిపోయి 60 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆరు మంది చనిపోయారు. కావున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఈ ప్రాంతం నుండి డంపింగ్ యార్డ్ తొలగించాలని టీచర్ యూనియన్ తరపున డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకన్న, ఏ ఐ ఎఫ్ టి యు నాయకులు మల్లేష్, ఐఎఫ్టియు నాయకులు శివ బాబు, సిపిఐ ఎమ్మెల్ నాయకులు దుర్గయ్య, సి పి ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సురేందర్, సావిత్రి, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

